సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలి

12-11-2026 | 08:14pm

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియ(Land Re-Survey Progress)ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలోని 85 గ్రామాల్లో చేపట్టిన భూ సర్వే పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని, సంబంధిత రైతుల సమక్షంలోనే భూముల సర్వే చేపట్టి, హద్దులను స్పష్టంగా గుర్తించాలని సూచించారు. సర్వే వివరాలను రైతులకు తెలియజేయడంతో పాటు, భూ రికార్డులను ఎలాంటి తప్పులకు తావులేకుండా స్పష్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

రీ సర్వేలో నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ రావు, ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ విఠల్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు