నిందితుడి అరెస్ట్
4.4 తులాల బంగారం, 25 తులాల వెండి, సెల్‌ఫోన్ స్వాధీనం
మేడిపల్లి, నవంబర్ 12 (విజయక్రాంతి): ఇంటి దొంగతనం కేసులో(House burglary case) నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 4.4 తులాల బంగారం, 25 తులాల వెండి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
ఈ నెల 8వ తేదీన బోడుప్పల్ ఎస్‌బీఆర్ కాలనీలో నివాసముంటున్న రవీంద్ర చారి ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం, ఇతర ఆధారాల సహాయంతో దొంగతనానికి పాల్పడిన కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం, రేగళ్ల గ్రామానికి చెందిన మాలోతు ప్రశాంత్ (25)ను గుర్తించి అరెస్టు చేసి,
అతని వద్ద నుంచి చోరీకి గురైన 4.4 తులాల బంగారం, 25 తులాల వెండి, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లు, 2023లో ఇల్లెందు పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై ఒక కేసు నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని సీఐ జలంధర్ రెడ్డి తెలిపారు.
కేసును త్వరితగతిన ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్ఐ బోలిశెట్టి శ్రీను, హెచ్‌సీ రాము, పీసీలు మహిపాల్, హరిబాబులను సిఐ అభినందించారు.