ఆర్ధిక సమ్మిళిత సేవల సంపూర్ణత ప్రచారం
భూత్పూర్, నవంబర్ 12 : అడ్డాకల మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో SBI బ్యాంక్(SBI Bank) ఆధ్వర్యంలో ఆర్ధిక సమ్మిళిత సేవల సంపూర్ణత ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా LDM చంద్రశేఖర్, CFL కౌన్సిలర్ M. నరేష్ లు మాట్లాడుతూ ప్రతి పౌరునికి ఆర్ధిక సేవలను మరింత చేరువగా చేయడం జరుగుతుందన్నారు. PMJDY ACCOUNTS, విద్యార్థులకు స్కాలర్షిప్ కొరకు OVER DRAFT ఫెసిలిటీ PMSBY, PMJJBY , APY పథకాలలో నమోదు.
PMSBY, PMJJBY పథకాలలో ఆధార్ అనుసంధానం, KCC , PMFBY దరకాస్తుల స్వీకరణ, పెండింగ్ లో ఉన్న ఖాతాలకు C-KYC ID రూపొందించడం జరుగుతుందని. అదేవిధంగా పనిచేయని PMJDY ఖాతాలను క్రియాశీలంగా మార్చడం, నామినీ వివరాల నవీకరణ, క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిష్కారాన్నికి దరఖాస్తు, సైబర్ క్రైమ్ 1930, డిజిటల్ అరెస్ట్ లపై వారు వివరించారు. వివరించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ కొండన్న, CSP అక్తర్ సుల్తానా పాల్గొని విజయవంతం చేశారు.