నిర్మల్ జిల్లాలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం

12-11-2026 | 08:22pm

ఖానాపూర్,(విజయక్రాంతి):  జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు(National health programs), ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, వైద్య సేవల అమలుతీరుపై సంబంధిత ప్రోగ్రామ్ అధికారులతో జిల్లా వైద్యాధికారి రాజేందర్(District Medical Officer Rajender) సమీక్ష చేశారు. మాట్లాడుతూ... జిల్లాలో అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

ప్రతి ఆరోగ్య కార్యక్రమానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాల సాధనలో ఎదురవుతున్న సమస్యలు, అడ్డంకులను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి తగిన పరిష్కార మార్గాలను అన్వేషించాలని తెలిపారు.

లక్ష్యాల సాధనలో వెనుకబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(Primary Health Centers)పై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత వైద్యాధికారులు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఆరోగ్య సమస్యల పట్ల తక్షణమే స్పందించాలని తెలిపారు.

గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యతనిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమం నిర్వహించిన అధికారులు డాక్టర్ నయాన రెడ్డి డాక్టర్ రాజా రమేష్ డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ రాకేష్ డాక్టర్ సౌమ్య జిల్లాలోని వైద్యాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు