మండల ప్రథమ ర్యాంకర్‌కు బహుమతి
హుజురాబాద్,(విజయక్రాంతి): పదో తరగతి పరీక్షల్లో హుజురాబాద్ మండల ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని కళ్లెపు అభినవ శ్రీకి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్(Sriram Life Insurance) సంస్థ రూ.10 వేల నగదు బహుమతిని అందజేసింది. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు క్రాంతి కుమార్, రజినిలకు మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ రాజేష్ ఖన్నా చెక్కును అందించారు.
ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలోనూ ప్రతిభావంతులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గంకిడి సమ్మిరెడ్డి, ఇన్చార్జి హెచ్ఎం భవాని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.