జిల్లా స్పీడ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ నూతన కమిటీ నియామకం

12-11-2026 | 08:28pm

చిట్యాల,(విజయక్రాంతి): నల్గొండ  జిల్లాలో స్పీడ్ హ్యాండ్‌బాల్ క్రీడాభివృద్ధికి తెలంగాణ స్పీడ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్(Telangana Speed Handball Association) నూతన కమిటీ బాధ్యులను గురువారం నియమించింది. రాష్ట్ర అసోసియేషన్ కార్యవర్గ నిర్ణయం మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా(Nalgonda district) అధ్యక్షుడిగా మంద వేణుగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏలుగు చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డి(President Manda Venugopal Reddy) మాట్లాడుతూ... తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అసోసియేషన్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి మెరుగైన శిక్షణ అందిస్తామని చెప్పారు. రాబోయే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో నల్గొండ జిల్లా జట్టును ప్రతిభావంతంగా తీర్చిదిద్ది విజయాలు సాధించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. నూతన కమిటీ నియామకం పట్ల జిల్లా క్రీడాకారులు, క్రీడా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు