అమీన్పూర్ వాసుల దశాబ్దాల కల సాకారం

12-11-2026 | 08:20pm

లింగంపల్లి నాలా బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎంపీ రఘునందన్ రావు.

రామచంద్రపురం నవంబర్ 12: లింగంపల్లి నాలాపై(Lingampally Nala) నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) పరిశీలించారు. జాతీయ రహదారి నుంచి నాలాపై నిర్మిస్తున్న బ్రిడ్జి మీదుగా అమీన్పూర్‌కు నేరుగా రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే అమీన్పూర్ ప్రజలకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు,

ఈ ప్రాంతంలో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.అమీన్పూర్ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రహదారి సౌకర్యం సాకారం దిశగా అడుగులు పడుతున్నాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు.

అదేవిధంగా బంధంకొమ్ము వద్ద రహదారి నిర్మాణానికి సంబంధించి ఎదురవుతున్న సమస్యలను కూడా పరిష్కరించామని, అక్కడ సైతం త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రజల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, అమీన్పూర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఎంపీ స్పష్టం చేశారు.దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడం ద్వారా అమీన్పూర్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.

మరిన్ని వార్తలు