22-ఎ భూములకు విముక్తి
హైదరాబాద్,(విజయక్రాంతి): 22-ఎ నిషేధిత భూముల సమస్యల(22A Prohibited lands issue)ను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Revenue Minister Ponguleti Srinivas Reddy) కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు.
22-ఎ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, ప్రతి వారం జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేశారు. పరిష్కారం కాని సమస్యలను ఉన్నతస్థాయి కమిటీకి పంపాలని సూచించారు.
యూఎల్సీ సమస్యల(ULC Land Issues)పై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని, జీవో 59, 76, 118 అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. 22-ఎ జాబితాలో ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ సమస్యలను కూడా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని తెలిపారు. ప్రభుత్వ భూముల విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.