శేఖర్ మాస్టర్‌కు తప్పిన పెనుప్రమాదం
శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన మరో వాహనం.. అసలేం జరిగింది?
హైదరాబాద్: తెల్లవారుజామున టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు Road Accidentకు గురైంది. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ సమీపంలో మరో వాహనం ఆయన కారును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్న సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాక’ సినిమా షూటింగ్ ముగించుకుని శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఉదయం సుమారు 6 గంటల సమయంలో ముచ్చింతల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్దకు చేరుకోగానే పాలమాకుల వైపు నుంచి వచ్చిన మరో కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ఈ Collision కారణంగా శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు కొంతమేర Damage అయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి శేఖర్ మాస్టర్ తన సిబ్బందితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. పెను ప్రమాదం తప్పడంతో సినీ వర్గాలు, అభిమానులు ఊరట చెందారు.