సర్వజ్ఞ స్కూల్ విద్యార్థుల సేవా కార్యక్రమం

12-11-2026 | 08:17pm

ఖమ్మం,(విజయక్రాంతి): సర్వజ్ఞ స్కూల్(Sarvajna School) 3, 4, 5వ తరగతి విద్యార్థులు మదర్ థెరిస్సా అనాథాశ్రమాన్ని(Mother Teresa Orphanage) సందర్శించారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలకు బియ్యం, అరటిపండ్లు, బిస్కెట్లు, పండ్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో సేవాభావం, మానవీయ విలువలు పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల చైర్మన్ ఆర్.వి. నాగేంద్ర కుమార్(School Chairman R.V. Nagendra Kumar) తెలిపారు.

విద్యతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ కె. నీలిమ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అనాథాశ్రమ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు