అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమం
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ మండలం(Kodad Mandal)లోని కూచిపూడి, కూచిపూడి తండా అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో మంగళవారం పోషణ మాసం కార్యక్రమం(Poshan Maasam Program)లో భాగంగా గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల(Pregnant Women)కు శ్రీమంతం, అక్షరాభ్యాసం కార్యక్రమాలతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల గురించి వివరించడం జరిగింది.
గర్భిణీలు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, పాటించాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, సమతుల్య ఆహారం యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు. కూచిపూడి కూచిపూడి తండా గ్రామాలకు చెందిన అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ శాంతాబాయి, ఉమ, దేవమణి కూచిపూడి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరుగ్రామాల సర్పంచులు సంధ్య వెంకటేశ్వర్లు, హాజీ నాయక్, ఉపసర్పంచులు బాదావత్ సీతామహాలక్ష్మి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్, కోదాడ నుండి సీడీపీఓ సత్యనారాయణ, ఏసీడీపీఓ కిరణ్మయి, సెక్టార్ సూపర్‌వైజర్ సరిత , పోషణ అభియాన్ నుండి ఫరిద్, ఇతర సూపర్‌వైజర్లు, అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.