నూతన ప్రజాస్వామిక విప్లవమే ప్రజలకు విముక్తి..

26-10-2026 | 07:01pm

దూడల వెంకన్న 37వ వర్ధంతి సభలో మామిడాల భిక్షపతి, ఆర్. జనార్ధన్ పిలుపు..

ఆలేరు, అక్టోబర్ 26 (విజయక్రాంతి): దోపిడీ, పీడన, అన్యాయం, అణిచివేతల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేది నూతన ప్రజాస్వామిక విప్లవమేనని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, సీపీఐ ఎం.ఎల్. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్. జనార్ధన్ అన్నారు. ఆదివారం శారాజీపేటలో కామ్రేడ్ దూడల వెంకన్న 37వ వర్ధంతి(Doodala Venkanna Death Anniversary) సభను నిర్వహించారు.

ఆయన స్మారక స్తూపం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ గ్రామ కార్యదర్శి అయిల యాకయ్య జెండా ఎగురవేయగా, గ్రామ ప్రధాన వీధుల గుండా ఎర్రజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, యాదాద్రి భువనగిరి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. దూడల వెంకన్న పోరాట స్ఫూర్తిని, విప్లవోద్యమంలో ఆయన పోషించిన పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇక్కిరి సహదేవ్, అయిల పెద్ద మార్కయ్య, బేజాడి కుమార్, ఆర్. సీత, మందనపల్లి పద్మ శశిరేఖ, తమ్మడి మాధవి, తమ్మడి ఉమ, పద్మ సుదర్శన్, శికిలం కుమారస్వామి, సిద్ధేశ్వ, ఆర్. ఉదయ్, బాల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు