సబ్ ప్లాన్ నిధులతో అంబేద్కర్ భవనం

26-10-2026 | 07:51pm

- పనులు ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ చందన రవీందర్

గజ్వేల్: గజ్వేల్- ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం(Gajwel-Pragnapur Municipality) పరిధిలోని 5వ వార్డులో గతంలో మంజూరైన ఎస్సీ ఎస్టీ  సబ్-ప్లాన్ ప్రత్యేక అభివృద్ధి నిధులతో నిర్మించనున్న అంబేద్కర్ భవన్ నిర్మాణ పనులకు(Ambedkar Bhavan Construction) సోమవారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ​ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చందన రవీందర్, మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, వైస్-చైర్‌పర్సన్  పద్మబాయి నర్సింగరావు, 5వ వార్డు కౌన్సిలర్ రూప వెంకటేష్, ముఖ్య అతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు. ​

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్  కమిషనర్  మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక, సాంస్కృతిక, విద్యాభివృద్ధికి అంబేద్కర్ భవన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేస్తూ వార్డులోని మౌలిక వసతుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి పాలకవర్గం, యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. భవన నిర్మాణ పనులను వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ​ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్, స్థానిక వార్డు నాయకులు,  కులసంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు