నేడు కాంగ్రెస్ పార్టీ సమావేశం

26-10-2026 | 07:49pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ హోటల్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం(Congress Committee Meeting) నిర్వహిస్తున్నట్టు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల హరీష్ తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశంలో చలో ఢిల్లీ కార్యక్రమం(Chalo Delhi Program)పై చర్చించడం జరుగుతుందన్నారు. నవంబర్ 1న  చలో ఢిల్లీ కార్యక్రమం పై చర్చించేందుకు ఈ సమావేశానికి ఏఐసీసీ అబ్జర్వర్ సిడి మేయప్పన్(AICC Observer CD Meyappan), ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రవణ్ రావు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

మరిన్ని వార్తలు