యశోదలో ఎండోస్పైన్ కేర్ సెంటర్
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో వస్తున్న ఆధునిక పరిణామాలు, నూతన చికిత్సా విధానాలపై చర్చించేందుకు యశోద ఆస్పత్రులు(Yashoda Hospitals), హైటెక్ సిటీలో ‘గ్లోబల్ ఎండోస్పున్ మీట్ హైదరాబాద్ అంతర్జాతీయ వైద్య సదస్సు, లైవ్ వర్క్‌షాప్ నిర్వహించారు. హైటెక్ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎండోస్పున్ కేర్ సెంటర్‌ను యశోద ఆస్పత్రుల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సురేందర్‌రావు ప్రారంభించారు.
యశోద ఆస్పత్రుల సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పున్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్అడ్వానస్డ్ ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీ డాక్టర్ బాల రాజశేఖర్ చంద్ర యేటుకూరి నాయకత్వంలో ఈ సదస్సు జరిగింది. ఇందులో ప్రముఖ స్పున్ సర్జన్లు, వైద్య నిపుణులు, పరిశోధకులు, అకడమిక్ నాయకులు పాల్గొని ఆధునిక శస్త్రచికిత్సా పద్ధతులు, క్లిష్టమైన వైద్య కేసులు, తా జా పరిశోధనలు, తమ అనుభవాలను పం చుకున్నారు. డాక్టర్ జి. సురేందర్‌రావు మాట్లాడుతూ.. నూతన ఎండోస్పున్ కేర్ సెం టర్ ద్వారా ఆధునిక సాంకేతికత, వైద్య నైపు ణ్యం, రోగి కేంద్రిత సేవల సమన్వయంతో సమగ్ర స్పున్ కేర్ అందిస్తామన్నారు. డాక్టర్ బాల రాజశేఖర్ చంద్ర యేటుకూరి మాట్లాడుతూ ఎండోస్కోపిక్ స్పున్ సర్జరీ అభివృద్ధికి వైద్య నిపుణుల మధ్య పరిజ్ఞాన మార్పిడి, పరస్పర సహకారం అవసరమన్నారు.