అయ్యప్ప ఆలయ సింహద్వారానికి ఎమ్మెల్యే భూమిపూజ

22-11-2026 | 07:08pm

నర్సంపేట, నవంబర్ 22( విజయక్రాంతి ): పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప స్వామి ఆలయ సింహద్వార నిర్మాణానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(Narsampet MLA Donthi Madhava Reddy) ఆదివారం శంకుస్థాపన చేశారు. తన తల్లిదండ్రులు కీ.శే. దొంతి కాంతమ్మ-నరసింహారెడ్డిల జ్ఞాపకార్థం ఈ నిర్మాణానికి ఆయన ఆర్థిక సహకారం(Financial Support) అందించారు. తొలుత ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఆలయ అభివృద్ధికి, భక్తుల(devotees) సౌకర్యార్థం చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ-రామానంద్, వైస్ ఛైర్మన్ గంధం నరేందర్, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్. వైస్ చైర్మన్  ఆలయ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు