కోటగుళ్లలో సిఐ నరేష్ కుమార్, డాక్టర్ నవీన్ కుమార్ పూజలు
22-11-2026 | 07:40pm
గణపురం,నవంబర్ 22 (విజయక్రాంతి) : మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో(Kotagulla) కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సర్కిల్ ఇన్స్పెక్టర్ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్(Circle Inspector Dommati Naresh Kumar Goud), జగిత్యాల వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ లు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.