బంజారా ఉద్యోగుల ఐక్యతే బలం
సంఘ బలోపేతానికి కార్యాచరణ
డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణకు నిర్ణయం
సభ్యత్వ నమోదు విస్తరణకు తీర్మానం
బాన్సువాడ, నవంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ(Banswada) పట్టణంలోని సాయి కృప నగర్ కాలనీలో గల ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం(All India Banjara Seva Sangh) ఆధ్వర్యంలో ఉద్యోగుల సమ్మేళన సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు సురేందర్ రాథోడ్(Surender Rathod), ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు మోతీరాం నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబ్య నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సురేందర్ రాథోడ్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న బంజారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులందరూ సంఘంలో భాగస్వాములై ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంఘ అభివృద్ధి, సామాజిక ఐక్యత కోసం సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.సంఘ కార్యకలాపాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సభ్యుల మధ్య సమన్వయం పెంపొందించేందుకు నూతన సంవత్సర డైరీని రూపొందించి ఆవిష్కరించాలని సమావేశం తీర్మానించింది.
అదేవిధంగా సంఘం పేరు, ఆశయాలు, లక్ష్యాలు, కార్యక్రమాలు, ముఖ్య నాయకుల వివరాలతో ప్రత్యేక క్యాలెండర్ను రూపొందించి సభ్యులకు అందించాలని తెలిపారు. ప్రతి బంజారా ఉద్యోగి, ఉపాధ్యాయుడు, ప్రభుత్వ అధికారి సంఘంలో సభ్యత్వం పొందేలా చర్యలు చేపట్టాలనిపిలుపునిచ్చారు. ప్రతి సభ్యుడి నుంచి ఏడాదికి రూ.200 సభ్యత్వ రుసుముగా వసూలు చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో బంజారా డివిజన్ అధ్యక్షుడు లచ్చిరాం నాయక్, మండల విద్యాధికారి, సంఘ సలహాదారుడు దేవిసింగ్, బాన్సువాడ డివిజన్ ప్రధాన కార్యదర్శి గోపి, గౌరవ అధ్యక్షుడు ప్రకాష్, జుక్కల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి హీరా జాదవ్ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సంఘ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.