ప్రజా సమస్యల పరిష్కారం కోసం మార్నింగ్ వాక్

22-11-2026 | 07:24pm

సుడ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి 

ముకరంపుర, నవంబర్ 22(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలోని(Karimnagar Municipal Corporation) రేకుర్తి 20 వ డివిజన్ లో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Komatireddy Narender Reddy) మార్నింగ్ వాక్ చేశారు. డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా వింటూ వాటి పరిష్కారం కోసం అధికారులుగా మాట్లాడుతూ ఆదివారం రేకుర్తి 25 డివిజన్లో మార్నింగ్ వాక్(Morning walk) చేశారు.

ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంపై(Indiramma Family Insurance Scheme) డివిజన్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాల పంపిణీ చేశారు. సుడా చైర్మన్ గా గతంలో మంజూరు చేసిన ప్రధానమైన సమ్మక్క సారలమ్మ రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.స్థానిక కార్పోరేటర్ పర్వతం మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన మార్నింగ్ వాక్ లో పలు కాలనీల ముఖ్యులు స్థానికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు