పుస్తె, మట్టెలు అందజేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

22-11-2026 | 07:11pm

కామారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి): పేదింటి ఆడపిల్ల పెళ్లి కోసం పుస్తె మట్టెలను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి(TPCC General Secretary Gaddam Chandrashekar Reddy) ఆదివారం అందజేశారు. కామారెడ్డి జిల్లా పల్వాంచ మండలం భవాని పేట గ్రామానికి చెందిన బాలరాజు కుమార్తె పావని పెళ్లి సందర్భంగా పెళ్లి కూతురి కి పుస్తే మట్టెలు అందజేశారు. పెళ్లి కూతురు తండ్రి లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కోరగా వెంటనే స్పందించి పెళ్లికి సంబంధించిన పూస్తే మట్టెలను స్వయంగా ఇంటికి వెళ్లి అందజేశారు.

అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి వైవిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ జూలూరి సుధాకర్, డిసిసి అధ్యక్షులు పంపరి లక్ష్మణ్, ఉప సర్పంచ్ రమేష్, పర్దిపెట్ సర్పంచ్ నరసింహారెడ్డి, సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు మెహర్ బాబా గౌడ్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమీల్,  చాట్ల వంశీ, నర్సుల మహేష్, బండారిశ్రీకాంత్, ఆబిద్, మున్ను, సయ్యద్ అహ్మద్, పండు శ్రీకాంత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు