కాంగ్రెస్‌లో బిల్లుల బాంబ్.. జగ్గారెడ్డి ప్రశ్నలతో కొత్త టెన్షన్!

22-11-2026 | 05:10pm

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో(Telangana Congress) మరోసారి అంతర్గత చర్చలు వేడెక్కాయి. ఒకవైపు చేసిన పనులకు బిల్లులు ఎప్పుడు వస్తాయన్న ఆందోళన.. మరోవైపు PAC సమావేశాల నిర్వహణపై సీనియర్ నేతల(Senior leaders) అభ్యంతరాలు.. కాంగ్రెస్‌లో రెండు కీలక అంశాలు రాజకీయంగా ఆసక్తిని రేపుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) వ్యాఖ్యలపై జగ్గారెడ్డి(Jagga Reddy) స్పష్టత కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పనులు చేసిన తర్వాత బిల్లులు రాకపోతే ఎలా ప్రశ్నిస్తున్నారు. 

ఎన్నికల సమయం దగ్గర పడేలోపు బిల్లులు చెల్లించకపోతే ఇబ్బందులు తప్పవని జగ్గారెడ్డి(Jagga Reddy) తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం నిర్వహణపై కూడా పార్టీలోని సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి పార్టీ నాయకత్వం ఎలా పరిష్కరిస్తుంది. బిల్లుల అంశంపై ఎలాంటి స్పష్టత వస్తుంది. PAC సమావేశాల నిర్వహణలో మార్పులు ఉంటాయా అనే దానిపై ఇప్పడు కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని వార్తలు