పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేస్తా
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియ
కామారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం ఇందుప్రియ(Gaddam Indupriya) అన్నారు. ఆదివారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) ను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.
మహిళల సాధికారత, పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్సీ సెల్ కార్యదర్శి పిడుగు మమత, నిత్య, గీత, ప్రవళిక, మనీషా, మమత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.