అగ్రిగోల్డ్ పరిశీలనలో పాల్గొనండి

22-11-2026 | 07:09pm

-సిపిఐ పోరాట ఫలితమే బాండ్ల పరిశీలన

ఖమ్మం టౌన్, నవంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే అగ్రిగోల్డ్ బాండ్ల(AgriGold Bond) పరిశీలనలో అగ్రిగోల్డ్ బాధితులందరూ పాల్గొనాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యర్రాబాబు, గుడిమెట్ల రజిత లు కోరారు. ఈనెల 25 నుండి జిల్లాలు, మండలాల వారీగా తేదీలతో కూడిన వివరాలను సిఐడి ప్రకటించిందని అందుకు అనుగుణంగా అగ్రిగోల్డ్ బాధితులు తమ వివరాలను అందజేయాలన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా కమిటీ -సమావేశం ఆదివారం బి. పుష్పలత అధ్యక్షతన జరిగింది.

సమావేశంలో యర్రాబాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆర్ముడ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్ ఖమ్మంలో బాండ్ల -పరిశీలన జరుగుతుందని ఇందుకు ఏసిపి, సిసిఎస్, ఎస్టి సర్వర్ ఇంచార్జిగా ఉంటారని ఆయన తెలిపారు. మండలాల వారీగా తేదీలు చూసుకుని హాజరు కావాలని ప్రతి రోజు 250 మంది అగ్రిగోల్డ్ బాండ్లు మాత్రమే పరిశీలన చేయబడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించి రూ.447 కోట్ల కుంభకోణం జరిగిందని ఇందులో భాగంగా 1.65 లక్షల మంది బాధితుల యొక్క బాండ్లను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే ముగ్గురు నిందితులను సిఐడి అరెస్టు చేయగా ఇతర ఆధారాల కోసం బాండ్ల పరిశీలన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.

అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన సిపిఐ అనేక పోరాటాలను నిర్వహించిందని బాధితులను సమీకరించి ఆందోళనలు చేసిన ఫలితంగానే ప్రభుత్వం -స్పందించిందని బాబు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు చింతల రమేష్, వి. లక్ష్మి నారాయణ, బొడ్డు నరేందర్, ఎం. లక్ష్మి, పిఎస్ఎన్ రాజు, వై. నర్సిరెడ్డి, కె. నర్సింహారావు, సత్యనారాయణ, బాబురావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు