ఎల్ నినోపై సంతలో విద్యార్థుల అవగాహన
11-11-2026 | 06:51pm
పాపన్నపేట,నవంబర్11: పాపన్నపేట ఉన్నత పాఠశాలలోని(Papannapet High School) యూత్ అండ్ ఈకో క్లబ్(Youth and Eco Club) ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం పాపన్నపేటలో జరిగే వారపు సంతలో ఎల్ నినోపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచుతూ అందరికి ఎల్ నినో పట్ల అవగాహన కల్పించారు. నీరు, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజాగౌడ్, మోహన్ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.