మహిళా సంఘాల బలోపేతానికి చేయూత

11-11-2026 | 06:51pm

ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

-రూ.47 లక్షల వ్యయంతో నిర్మించిన అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే 

​చుంచుపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విస్తరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni Sambasiva Rao) పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పెనగడప-అంబేద్కర్ నగర్, వెంకటేశ్వర కాలనీ, బంజారాహీల్స్ నందతాండా, గరిమెళ్ళపాడు ప్రాంతాల్లో దాదాపు రూ. 47 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

అంబేద్కర్ నగర్‌లో రూ. 10 లక్షలు, వెంకటేశ్వర కాలనీలో రూ. 10 లక్షలతో నిర్మించిన వీవో భవనాలతో పాటు, నందతాండాలో రూ. 12 లక్షలతో పూర్తి చేసిన అంతర్గత సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం గరిమెళ్ళపాడులో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, మురుగు కాలువల పనులను ప్రారంభించి ప్రజల వినియోగానికి అప్పగించారు.

మరిన్ని వార్తలు