అయ్యప్ప స్వామి సన్నిధిలో వరుణ యాగం

13-09-2026 | 12:28am

సూర్యాపేట,(విజయక్రాంతి): పట్టణంలోని శబరి నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం(Sri Ayyappa Swamy Temple)లో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శనివారం వరుణ యాగం(Varuna Yagya) నిర్వహించారు. ఈ యాగంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాదిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, చివ్వేంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుముల సునీల్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఎలిమినేటి అభినయ్ నాయుడు, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఉప్పుల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు