ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

13-09-2026 | 01:10am

కోదాడ: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండలం ముకుందాపురం వద్ద ముక్యాల బ్రాంచ్ కాలువలో ఈత(Swimming)కు వెళ్లి గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతులు కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గుడిబండకు చెందిన యలమర్తి స్వరూప్, కోదాడకు చెందిన సరికి హరీష్ గా గుర్తించారు. రెండో శనివారం సెలవు కావడంతో ముగ్గురు మిత్రులు ముకుందాపురానికి చెందిన అనుదీప్ ఇంటికి వెళ్లారు.

అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు ముగ్గురు కాలువలోకి దిగారు. కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ముగ్గురు నీట మునిగి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు అనుదీప్ ను కాపాడగా, మిగిలిన ఇద్దరి ఆచూకీ లభ్యం కాలేదు.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా కొండాపురం సమీపంలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు