పాదచారులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
కోదాడ అక్టోబర్ 30,(విజయ క్రాంతి): సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాల ప్రకారం రోడ్డుకు ఇరువైపులా పాదచారులకు ఇబ్బంది లేకుండా టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ పోలీసులు(Traffic police) శుక్రవారం అడ్డంకులు తొలగింపజేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు, అనధికార నిర్మాణాలు, వ్యాపారుల వల్ల కలుగుతున్న ఇబ్బందులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాదచారులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నారు. ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి, టౌన్ బిల్డింగ్ ఆఫీసర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా అడ్డంగా ఉన్న బోర్డులను తొలగింపజేశారు. పాదచారులకు అడ్డంకులు లేకుండా చేశారు. బోర్డులు వంటివి ఏర్పాటుచేయవద్దని షాప్స్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.