క్రైస్తవుల భద్రతకు సహకరిస్తాం

30-10-2026 | 08:40pm

సమాధుల తోట మంజూరుకు కృషి చేస్తాం.. ఎస్‌ఐ శ్రీకాంత్‌ గౌడ్‌, తహసీల్దార్‌ స్రవంతి హామీ

గరిడేపల్లి, అక్టోబర్ 30,(విజయ క్రాంతి): గరిడేపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ(Garidepally Mandal Pastors Fellowship Committee) ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీకాంత్‌ గౌడ్‌, తహసీల్దార్‌ స్రవంతిని కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలోని క్రైస్తవుల భద్రతకు సహకరించాలని ఎస్‌ఐని కోరారు. క్రైస్తవులకు చట్టపరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.

అనంతరం గరిడేపల్లిలో క్రైస్తవుల కోసం సమాధుల తోట మంజూరు చేయాలని తహసీల్దార్‌ స్రవంతి కి వినతిపత్రం సమర్పించారు. ఈ సంబంధిత అధికారులతో మాట్లాడి సమాధుల తోట మంజూరుకు తనవంతు కృషి చేస్తానని తహసీల్దార్‌ స్రవంతి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ చైర్మన్‌ ఎం. బెంజమిన్‌, అధ్యక్షుడు ఎ. రమేష్‌, ఉపాధ్యక్షుడు జాన్‌ వెస్లీ, కార్యదర్శి ఐజాక్‌ న్యూటన్‌, గౌరవ సలహాదారులు ఎ. మత్తయి, కె.జె. ఉదయ్‌బాబు, వి. లాజర్‌తో పాటు నాగరాజు, ఇశ్రాయేలు, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు