అట్టహాసంగా పీఎం శ్రీ ఆటల పోటీలు

30-10-2026 | 08:45pm

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా సాయి పీఎం శ్రీ ఆటల పోటీలు(PM SHRI Sports Competitions) అట్టహాసంగా జరిగాయి. పట్టణంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ)  జరిగిన ఆటల పోటీలను జిల్లా డీ ఓ పీ చంద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

అదేవిధంగా ఇక్కడ గెలుపొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు ఆటలతోపాటు చదువులో కూడా చురుకుగా ఉండాలని విద్యార్థులకు దిశ నిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అకిడి విద్యాసాగర్, మంచిర్యాల జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎండి యాకూబ్, పీ ఈ టీ వామన్, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు