ప్రజావాణిలో 8 దరఖాస్తులు
23-11-2026 | 08:50pm
నేరేడుచర్ల, నవంబర్ 23(విజయ క్రాంతి): నేరేడుచర్ల మండలంలో సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో(Public service program) మొత్తం 8 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీవో నాగరాజు తెలిపారు.వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 4, గ్రామీణాభివృద్ధి శాఖకు 1, హౌసింగ్ శాఖకు 1, టెలీకామ్ శాఖకు 1, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన కామన్ దరఖాస్తు 1 వచ్చాయి. ఈ ప్రజావాణిలో కార్యక్రమంలో మొత్తం 17 మంది అధికారులు పాల్గొన్నారని,ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు.