ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలు చేరాలి

26-10-2026 | 08:47pm

జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు యడవల్లి అరుణ్ మాదిగ..

నేరేడుచర్ల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్న గ్రామంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ(MRPS founder Mandakrishna Madiga) ఆదేశాల మేరకు ఎం ఎస్ ఎఫ్(మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్) గ్రామ మండల కమిటీల నిర్మాణంలో భాగంగా మండల అధ్యక్షులు మిడతపల్లి శీను మాదిగ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశoలో జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు యడవల్లి అరుణ్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ జీవితాన్ని మాదిగ జాతి కోసం త్యాగం చేసి పలుపెరుగని పోరాటం చేసి వర్గీకరణ ఫలాలు సాధించారని వర్గీకరణ పలాలు ప్రతి ఒక్కరూ మాదిగ, ఉప కులాల విద్యార్థి అందిపుచ్చుకోవడం కోసం ఉన్నంతగా చదువుకోవాలని, ఎవరు చదువులో డ్రాప్ కావద్దని విద్యాసంస్థల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎంఎస్ఎఫ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని తల్లిదండ్రులు కన్న కలలు నిజం చేయాలని కోరారు.

అనంతరం ఎంఎస్ఎఫ్ గ్రామ కమిటీ ఎన్నికలో గ్రామ ఎం ఎస్ ఎఫ్ అధ్యక్షుడు సిద్ధపంగా సంజయ్, ప్రధాన కార్యదర్శి ఎడవల్లి చింటూ, అధికార ప్రతినిధి అమరవరపు.వంశీ ,సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి ఎన్ సోమయ్య, విద్యాసాగరు, సైదులు, భరత్,తరుణ్, గోపి,చిన్న, చింటూ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు