రాష్ట్ర స్థాయికి అక్కెనపల్లి విద్యార్థిని రక్షిత

26-10-2026 | 10:14pm

మాక్ పార్లమెంట్ పోటీల్లో జిల్లా ప్రథమ స్థానం

నంగునూరు, అక్టోబర్ 26: సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ పోటీల్లో అక్కెనపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని జీల రక్షిత(Rakshitha) అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.

ఈ విజయంతో ఆమె రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రతిభను గుర్తించిన జిల్లా విద్యాధికారి రమేష్ ఆమెను అభినందించి,రాష్ట్ర స్థాయిలోనూ విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని పాఠశాల ప్రిన్సిపాల్ మంద జానయ్య పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రక్షిత ఇదే స్ఫూర్తితో కొనసాగించి పాఠశాల కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు