పోచ్చేర గ్రామంలో భీమ్ వర్ధంతి వేడుకలు

26-10-2026 | 09:52pm

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని పోచ్చెర గ్రామం(Pochera village)లో సోమవారం గ్రామ యువకులు కొమురం భీం వర్ధంతి(Komaram Bheem Death Anniversary) నిర్వహించారు. ఈ సందర్భంగా భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జల్ జంగల్ జమీన్(Jal, Jungle, Zameen) నినాదంతో అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడి తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచి తన ప్రాణాలను అర్పించిన గొప్ప యోధుడని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామానికి చెందిన యువకులంతా భీమ్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు