మండల ప్రజలకు అన్యాయం చేయొద్దు
26-10-2026 | 10:10pm
నేరడిగొండ (విజయక్రాంతి): రైల్వే రీసర్వేలో నేరడిగొండ మండల ప్రజలకు అన్యాయం చేయొద్దని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయా పార్టీల నాయకులు ఎంపీడీఓ సాగర్ రెడ్డి(MPDO Sagar Reddy)కి వినతిపత్రం అందజేశారు. జంక్షన్ నిర్మించి మండల కేంద్రానికి అనుసంధానం చేసినట్లయితే కుంటాల జలపాతానికి వచ్చే పర్యాటకులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ప్రజలకు లబ్ది చేకూరుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. రైల్వే లైన్ ను నేరడిగొండ మండలానికి కలుపుకొని చేపట్టకపోతే ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.