సెంటినరీ కాలనీ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా బైరి శంకర్ ఏకగ్రీవ ఎన్నిక

26-10-2026 | 09:57pm

రామగిరి, అక్టోబర్26 (విజయక్రాంతి): రామగిరి మండలం సెంటినరీ కాలనీ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులుగా బైరి శంకర్(Bairi Shankar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రం రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన సంఘం నూతన కమిటీ ఎన్నికల్లో ఆయనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల కార్యక్రమాన్ని రామగిరి మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బండారి సదానందం, ఉపాధ్యక్షులు చిలువేరు స్వామి, ప్రధాన కార్యదర్శి ఆడెపు వైకుంఠం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య, రామగిరి మండల గౌరవ అధ్యక్షులు ఏల్లే రామ్మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు బైరి శంకర్ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించి, తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పద్మశాలి కులబంధువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, పద్మశాలి కులబంధువుల ఐక్యతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అందరినీ కలుపుకొని సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సెంటినరీ కాలనీ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా బైరి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పద్మశాలి కులబంధువులు, సంఘం నాయకులు పలువురు ఆయనను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు