కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పునాది
19-09-2026 | 07:39pm
ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందుల సూర్యకిరణ్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాది అని, వారి కృషితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మందుల సూర్యకిరణ్ అన్నారు. శనివారం మండల కేంద్రం అర్వపల్లిలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, పార్టీ బలోపేతం కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.