విద్యార్థులే ఓటర్లు.. అసెంబ్లీ ఎన్నికలు!
మోరంపల్లి బంజర్ జడ్‌పీహెచ్‌ఎస్‌లో నమూనా ఎన్నికలు
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని మోరంపల్లి బంజర్ జడ్‌పీహెచ్‌ఎస్(Morampally Banjar ZPHS)లో శనివారం అసెంబ్లీ నమూనా ఎన్నికల(Assembly model elections)ను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు పద్మావతి, ఉమాదేవి ఆధ్వర్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, గుర్తుల కేటాయింపు, ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలను విద్యార్థులతో నిర్వహించారు. సావిత్రిబాయి పూలే పార్టీ అభ్యర్థి వివేక్ నాయక్(Savitribai Phule Party candidate Vivek Naik) పాఠశాల ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
అనంతరం విద్యాశాఖ, ఆరోగ్య, ఆహార, క్రీడా–సాంస్కృతిక, బాలికా సంరక్షణ శాఖల మంత్రులతో మంత్రి మండలిని ఏర్పాటు చేశారు.ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహించడం ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్యం, ఓటు హక్కు, ఎన్నికల విధానంపై ఆచరణాత్మక అవగాహన కలుగుతుందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.