మాదిగ సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక
19-09-2026 | 08:42pm
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మాదిగ సంక్షేమ సంఘం(Madiga Welfare Association) మొదటి సమావేశం కేసముద్రం మండలంలోని శ్రీలక్ష్మి సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగింది. అనంతరం నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు. సంఘం నూతన అధ్యక్షులుగా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పోలెపాక ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శిగా కల్వల గ్రామానికి చెందిన మూరగుండ్ల యాదగిరి, ఉపాధ్యక్షులుగా ఉప్పరపల్లికి చెందిన మంద సాయి బాబా, కేసముద్రంకు చెందిన సోమారపు మదార్, సహాయ కార్యదర్శిగా ధనసరికి చెందిన చింతకుంట్ల వెంకన్న, కోశాధికారిగా కేసముద్రం విలేజ్ కి చెందిన పందుల సారయ్య , గౌరవ సలహాదారులు, ఆడిట్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోలెపాక నాగరాజు,జల్లే యాకాంబరం పాల్గొన్నారు.