మండల స్థాయి సమీక్షా సమావేశం

19-09-2026 | 07:57pm

బేల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సర్పంచ్‌లు తెలిపిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని, తమ పరిధిలో పరిష్కరించలేని సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మండల ప్రత్యేక అధికారి మనోహర్(Mandal Special Officer Manohar) అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మనోహర్, ఎంపీడీవో మహేష్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వామన్, వివిధ శాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శాఖల వారీగా అభివృద్ధి పనుల(Development works) గురించి అధికారులు వివరించారు. పలు సమస్యలను సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించాలని కోరుతూ సర్పంచ్‌ల సంఘం తరఫున అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు. ఈ సమావేశంలో శాఖల వారీగా అభివృద్ధి పనులు, పలు సమస్యలను సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకెళ్లగ

మరిన్ని వార్తలు