నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ళేశ్వరం జోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ(Crime Control), మహిళలు, బాలికల భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కాళేశ్వరం జోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా(Kaleshwaram Zone-1 DIG Amber Kishore Jha), పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం ఆసిఫాబాద్ పట్టణ పోలీస్‌స్టేషన్, వాంకిడి సీఐ కార్యాలయాన్ని(Wankidi CI office) ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు.
కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం ఉండాలని, అన్ని ఆధారాలను సేకరించి పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్, పోలీసు అధికారులు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.