మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతున్న డ్రైనేజీలు...
- నేషనల్ హైవే డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం..
- వ్యాపారుల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేని మున్సిపల్ కార్పొరేషన్...
కొత్తగూడెం సెప్టెంబర్ 19 విజయ క్రాంతి: భద్రాద్రి జిల్లా విజయవాడ నేషనల్ హైవే (Vijayawada National Highway)ఇరువైపులా జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులలో పూర్తిగా నత్త నడకన నడుస్తున్నాయి అనడానికి ఇదొక నిదర్శనం.. అసలే వర్షాకాలం పనులన్నీ వర్షాకాలంలోనే నిర్మాణాలు చేపట్టడం చిరు వ్యాపారులను, వర్తక వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు.ఈ డ్రైనేజీ పనులు. గత రెండు నెలలుగా మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, చేపట్టిన ఈ సైడ్ డ్రైనేజీలలో (కాలువలు) పూర్తిగా మురుగునీటితో నుండి, దుకాణ యజమానుదారుల, వ్యాపార సముదాయాన్ని, వ్యాపార వ్యవస్థను పూర్తిగా దెబ్బతిస్తుంది
కార్పొరేషన్ వ్యవస్థ సమయానికి పన్నులు చెల్లించకపోతే నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురి చేసే కార్పొరేషన్, నేడు అదే వ్యాపారుల చెంతన మురికి కాలువలు, సైడ్ డ్రైనేజీలు పూర్తిగా నిలువెత్తు మురుగునీటితో నిండి, దోమల సంచారానికి ఆవాసానికి నిలయంగా మారాయి. వ్యాపారులు దుకాణం తెరవాలంటే ముక్కు మూసుకుని, వ్యాపారాలు చేసుకునే పరిస్థితి, దానికి తోడు వినియోగదారులు( కస్టమర్లు) లేక వ్యాపారాలు వెలవెలబోతున్నాయి.
నత్తనడకన నడుస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వర్తక, వాణిజ్య వ్యాపార సంఘాలు నగరపాలక సంస్థ అధికారులను,ఆర్ అండ్ బి అధికారులను వేడుకుంటున్నాయి. వర్షాకాలంలో నీరు నిలవకుండా చూసుకోవాలని, పెద్దపెద్ద భారీ కటౌట్లతో ప్రచార సాధనాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటూ జేబులు నింపుకుంటున్నాయ,అని ప్రజలు పత్రిక ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క కాల్వలో నీరు నిలిచిపోయి, వ్యాపారస్తులను అనారోగ్య పాలు చేయడంలో నగరపాలక సంస్థ వైఖరి ఏమిటి,
దానిపై కనీసం బ్లీచింగ్ పౌడర్ ఇతరత్రా దోమల నివారణ మందులను పిచికారీ చేయకుండా ఎవరికి పట్టనట్టు వ్యవహరించడం సరైనది కాదని, ఇకనైనా ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో నగరపాలక సంస్థ పనిచేసి వ్యాపారులకు, అండగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.రాజకీయ నాయకులు దీనిపై స్పందించకుండా, కాలయాపన చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజా సమస్యల పట్ల ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో, రాజకీయ నాయకులు అధికారులు పనిచేయాలని స్థానికులు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సైడ్ కాలువల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు, వ్యాపారులు ఆకాంక్షి స్తున్నారు.