మంత్రి పొంగులేటి క్యాంప్‌ కార్యాలయంలో గణపయ్యకు ఘన వీడ్కోలు

19-09-2026 | 08:47pm

ఖమ్మం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఖమ్మంలోని క్యాంప్‌ కార్యాలయ ఆవరణలో ప్రతిష్ఠించిన మట్టి గణపయ్యకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఐదు రోజులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడిని భక్తిశ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. క్యాంప్‌ కార్యాలయ ఆవరణలో గణపతి ఉత్సవాలతో పండుగ శోభ నెలకొంది. ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, హారతులతో గణనాథుడిని కొలిచారు. శనివారం క్యాంప్‌ కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విఘ్నేశ్వరుడిని కదిలించారు.

అనంతరం భక్తులు, నాయకులు, సిబ్బంది వెంట రాగా భక్తి పారవశ్యంతో వీ. వెంకటాయపాలెం చెరువుకు తరలించారు. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల మధ్య సంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేశారు. దీంతో క్యాంప్‌ కార్యాలయంలో ఐదు రోజులపాటు కొనసాగిన గణపతి ఉత్సవాలకు ఘనంగా ముగింపు పలికారు.

మరిన్ని వార్తలు