అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాలు

19-09-2026 | 08:39pm

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ఐదు మండలాలు 76 మంది దివ్యాంగుల విద్యార్థులను గుర్తించి ఉచితంగా సహాయ ఉపకరణాలు గుర్తింపు శిబిరం నిర్వహించడం జరిగింది. ఎల్లారెడ్డి పట్టణంలోని బాలగోడు ఫంక్షన్ హాల్లో (Balagod Function Hall)ఆ లింకు సమగ్ర శిక్ష కామారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల విద్యార్థులకు సహాయ ఉపకారణాల గుర్తింపు శిబిరంలో భాగంగా 76 మంది దివ్యాంగుల విద్యార్థులు ఎల్లారెడ్డి, 20 నాగిరెడ్డిపేట, 16 లింగంపేట 20 నిజాంసాగర్, 8, మా మహమ్మద్ నగర్(12) మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా అలింకో సమగ్ర శిక్ష కామారెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన వారికి డిసెంబర్  నెలలో ఉపకారణాలు పంపిణీ చేయడం జరుగుతుందని మండల విద్యాధికారి రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్యా సమన్వయకర్త నాగేందర్ అలింకో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఐఈఆర్పిఎస్, వెంకటేశం స్వాతి సుజాత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు