విద్యార్థులకు కెరీర్ దిశానిర్దేశం
19-09-2026 | 07:56pm
వాంకిడి, (విజయ క్రాంతి):స్థానిక వాంకిడి మండల కేంద్రంలోని పీఎం శ్రీ జడ్పీ హెచ్ఎస్ (PM SHRI ZP HS) పాఠశాలలో శనివారం విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని (Counseling program) నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కాంపెల్లి ఊషన్న విద్యార్థులకు ఉన్నత విద్య, కెరీర్ అవకాశాలు, భవిష్యత్తు లక్ష్యాలపై తగిన మార్గదర్శకత్వం అందించారు.విద్యార్థులు జీవితంలో పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా కెరీర్‌ను ఎంచుకోవాలని సూచించారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నటరాజు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.