పంట రక్షణకు పెట్టిన విద్యుత్ తగిలి వ్యక్తి మృతి

24-10-2026 | 10:56pm

కల్హేర్ అక్టోబర్ 24: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కల్హేర్ మండల పరిధిలోని నాగ్ధార్ గ్రామ శివార్లో పంట చేనుకు అడవి పందులు(Wild boars) రాకుండా పొలం రక్షణకు(Protection of the field) కరెంట్ అమర్చారు కరెంట్ తీగలకు తగిలి వ్యక్తి మృతి(Death of an individual) చెందాడు. కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ తెలిపిన సమాచారం ప్రకారం చీలపల్లి రాములు తండ్రి లింగయ్య గ్రామం పోశెట్టిపల్లి  రాంచందర్ తండాకు చెందిన వ్యక్తి పాశం బాలిరెడ్డికి చెందిన భూమీనీ కౌలుకు తీసుకొని అందులో వరి సాగుచేస్తున్నాడు. పొలంలో అడవి పందులు రాకుండా పొలం చుట్టూ కరెంట్ వైర్ అమర్చాడు.

ఈ నెల 16 తారీఖున సాయంత్రం 7:30 గంటల అందజ కొక్కండ సామెల్ నాగ్ధార్ గ్రామనికి చెందిన వ్యక్తి మద్యం మత్తులో వెళ్ళి పొలంలో పెట్టిన కరెంట్ తీగలకు తగిలి మృతి చెందాడు. దీనిపై మృతుని భార్య సామవ్వ ఇచ్చిన పిర్యాదు  మేరకు కల్హేర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతికి కారకులైన వారిని రిమాండ్ కి పంపించడం జరిగిందని కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ తెలిపారు.

ఈ మేరకు అయన మాట్లాడుతూ...రైతులు తమ పంట పొలాల చుట్టూ విద్యుత్ వేయొద్దని, విద్యుత్ వేసినట్టు తెలియకుండా (గ్రహించని) వారు వెళ్ళి షాక్ కు గురై మృతి చెందే అవకాశం ఉంది కాబట్టి పంటలను జంతువుల భారీ నుండి కాపాడుకోవడానికి సోలార్ (లేదా) భుంగలు ప్రత్యామ్నాయంగా అమర్చుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు