మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన గోళ్ల జానయ్య
* సంతాపం తెలిపిన వట్టే జానయ్య యాదవ్
సూర్యాపేట రూరల్,అక్టోబర్ 24: సూర్యాపేట మండలం(Suryapet Mandal) బాలెంల రోడ్డు వద్ద వాకింగ్ కి వెళ్లిన వారిపైకి ఇటీవల వెనుక నుంచి లారీ దూసుకొచ్చి బీభత్సం సృష్టించిన ప్రమాదంలో ఇద్దరు అదే రోజు మరణించగా తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ఆరెగూడెం గ్రామానికి చెందిన గోళ్ల జానయ్య ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల బీసీ ఉద్యమ నాయకులు వట్టే జానయ్య యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ,ఆయన మృతదేహానికి పూలమాల వేసి,మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వల్లల సైదులు యాదవ్, లింగాల సైదులు తదితరులు పాల్గొని గోళ్ల జానయ్యకు ఘనంగా నివాళులర్పించారు.