ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మకమైన విద్య అందించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలల్లో(Government School) గుణాత్మకమైన విద్యతో పాటు మౌలిక వసతులు పక్కాగా అందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) అధికారులను ఆదేశించారు. ఆత్మకూర్(ఎస్) మండలం మిడ్తనపల్లి గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్, ప్రైమరీ స్కూల్(Primary School) ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లిన కలెక్టర్, విద్యార్థులతో నేరుగా సంభాషించారు. పాఠ్యాంశాలపై వారిని పలు ప్రశ్నలు అడిగి, వారి సందేహాలను ఎంతో ఓపిగ్గా నివృత్తి చేశారు.
బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాలలోని వంట గదిను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యత, పారిశుద్ధ్య ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పరిశుభ్రమైన, పౌష్టికాహారాన్ని మాత్రమే వడ్డించాలని, వంటకాల తయారీలో ఎలాంటి అలసత్వం వహించవద్దని నిర్వాహకులకు స్పష్టం చేశారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను, రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలలో ఏవైనా మౌలిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి విశాల్, తహసిల్దార్ హమీన్ సింగ్, ఎంఈఓ ధారాసింగ్ ఉపాధ్యాయులు స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.