పోలీసుల విధులు.. సేవలపై విద్యార్థులకు అవగాహన
ఇల్లందకుంట పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
హుజురాబాద్,(విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో(Police Martyrs' Commemoration Week) భాగంగా మంగళవారం ఇల్లందకుంట పోలీస్ స్టేషన్(Illanthakunta Police Station)లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు(Students) పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీసుల విధులు, స్టేషన్ పనితీరు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం పోలీసులు చేపట్టే చర్యలపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా ఎస్సై ఎం. క్రాంతికుమార్ విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్లు, ప్రజలకు అందించే సేవలను వివరించారు. విద్యార్థుల్లో పోలీస్ శాఖ పట్ల గౌరవం పెంపొందించడంతో పాటు సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడమే ఓపెన్ హౌస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పోలీసు అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయడంతో పాటు పోలీసుల సేవలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.