శ్రీగణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక పూజలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 20: మండల కేంద్రం అర్వపల్లిలో శ్రీగణేష్ యూత్(Sri Ganesh Youth) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ గణేష్ యూత్ ఆహ్వానం మేరకు ఆదివారం వినాయకుడి ప్రత్యేక పూజలో మాజీ జెడ్పీటీసీ, బీఆర్ఎస్ జిల్లా నాయకులు దావుల వీరప్రసాద్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా దావుల వీరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు గ్రామంలో ఐక్యతను,భక్తి భావాన్ని పెంపొందిస్తాయని,యువత ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్నప్రసాద వితరణ దాతలు తాడూరి యాదగిరి-రేణుక దంపతులు,కమిటీ సభ్యులు పులిచర్ల ప్రభాకర్,ప్రభు,ఎల్లెంల శ్రీకాంత్,నీలం అజయ్,వేణుగోపాల్,నాగరాజు,వేణు,శివ,మారపాక సంతోష్ తదితరులు పాల్గొన్నారు.